అఖండ -2 రిలీజ్ ఎప్పుడు? ప్రొడ్యూసర్ ను పొట్టు పొట్టు తిడుతున్న ఫ్యాన్స్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-05 02:02:11  IST  )

తెల్లవారితే అఖండ-2 సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రిలీజ్ ను..

అఖండ -2 రిలీజ్ ఎప్పుడు? ప్రొడ్యూసర్ ను పొట్టు పొట్టు తిడుతున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెల్లవారితే అఖండ-2 సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ గురువారం అర్థరాత్రి ప్రకటించింది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈరోస్ నిర్మాణ సంస్థతో నెలకొన్న ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగా అఖండ-2 రిలీజ్ ఆగిపోయిందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఇవన్నీ ముందే క్లియర్ చేసుకోవడం తెలీదా అంటూ నిర్మాణ సంస్థను పొట్టు పొట్టు తిడుతున్నారు. ఫ్యాన్స్ కు బాలయ్య సినిమా విడుదల అంటే ఒక పండుగ అని, తమ మనోభావాలతో ఆడుకున్నారని వాపోతున్నారు. పైగా విడుదల తేదీ త్వరలోనే చెప్తామని ప్రకటించడంతో ఇంకెప్పుడు సినిమా రిలీజ్ చేస్తారని ఫైరవుతున్నారు.

కాగా.. అఖండ-2 విడుదల వాయిదా పడటంతో సంక్రాంతి 2026కే రిలీజ్ చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. సంక్రాంతి బరిలో ఇప్పటికే నాలుగు సినిమాలు థియేటర్లు ఫిక్స్ చేసుకున్నాయి. మన శంకరవరప్రసాద్ గారు, ది రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి సినిమాలతో పాటు జయ నాయగన్, పరాశక్తి సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో డిసెంబర్ 18న సినిమా విడుదల కాబోతుందని ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Read More..

BIG NEWS: అఖండ-2 విడుదల వాయిదా.. ప్రకటించిన నిర్మాణ సంస్థ

అఖండ-2 క్రిటిక్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Next Story