BIG NEWS: అఖండ-2 విడుదల వాయిదా.. ప్రకటించిన నిర్మాణ సంస్థ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-07 14:10:04  IST  )

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన అఖండ-2 తాండవం సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సి ఉంది.

BIG NEWS: అఖండ-2 విడుదల వాయిదా.. ప్రకటించిన నిర్మాణ సంస్థ
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన అఖండ-2 తాండవం సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సి ఉంది. కానీ.. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పై నెలకొన్న ఆర్థిక వివాదాలతో సినిమా విడుదలపై రెండ్రోజులుగా సందిగ్ధత నెలకొంది. తాజాగా సినిమా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. గురువారం రాత్రి ప్రీమియర్స్ పడాల్సి ఉండగా.. టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టింది. 5న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావాల్సి ఉండగా.. అఖండ-2లో బాలయ్య తాండవం చూసేందుకు ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూశారు.ఈ తరుణంలో నిర్మాణ సంస్థ చేసిన ప్రకటన అందరినీ నిరాశ పరిచింది.

"అనివార్య పరిస్థితుల కారణంగా అఖండ2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని మీకు తెలియజేయడానికి బరువెక్కిన హృదయంతో చింతిస్తున్నాము . ఇది మాకు బాధాకరమైన క్షణం. సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము నిజంగా అర్థం చేసుకున్నాము. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. సినిమా విడుదలను వాయిదా వేయడం వల్ల కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. ఈ సమయంలో మీ సపోర్ట్ మాకు కావాలి. అతిత్వరలోనే విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ ఇస్తాం" అని 14 రీల్స్ ప్లస్ సంస్థ ట్వీట్ లో పేర్కొంది.

Read More..

అఖండ -2 రిలీజ్ ఎప్పుడు? ప్రొడ్యూసర్ ను పొట్టు పొట్టు తిడుతున్న ఫ్యాన్స్

అఖండ-2 క్రిటిక్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Next Story