- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ వర్కింగ్ స్టైల్‌పై దిల్ రాజు ప్రశంసలు
విజయ్ ప్రతి సినిమాకు దాదాపు 100 రోజుల కాల్‌షీట్లు ఇస్తారని దిల్ రాజు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆయన తెలుగు చిత్రాలతో పాటు తమిళ్, హిందీ సినిమాలను కూడా నిర్మించడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా కొంతకాలం క్రితం తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'వారిసు' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని విజయ్ వర్కింగ్ స్టైల్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, "విజయ్ గారి వర్కింగ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు ప్రతి సినిమాకు ఆయన 100 రోజుల కాల్‌షీట్లు ఇస్తారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వరుసగా షూటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 10 రోజులపాటు విశ్రాంతి తీసుకుంటారు. ఇలా ప్లాన్ ప్రకారం పనిచేయడం వల్ల సినిమా షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తవుతుంది" అని తెలిపారు. ఇక ప్రస్తుతం దిల్ రాజు 'ఎల్లమ్మ', 'రౌడీ జనార్ధన' చిత్రాలను నిర్మిస్తున్నారు.






