- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
108 అంతస్తుల ఐకానిక్ భవనంలోకి దూసుకెళ్లిన ఎయిర్ క్రాఫ్ట్
చైనా రాజధాని బీజింగ్‌లోని అత్యంత ఎత్తైన ‘చైనా జున్’ టవర్‌ను ఓ చిన్న విమానం ఢీకొట్టడం కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: చైనా విమాన ప్రమాదం జరిగింది. బీజింగ్‌లో అతిపెద్ద ఆకాశహర్మ్యంగా పేరుగాంచిన 108 అంతస్తుల భారీ భవనం సిటిక్ టవర్ (చైనా జున్)ను ఓ చిన్న విమానం ఢీ కొట్టింది. సన్ వార్డ్ SA 60L అరోరా లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ భవనంలోని ఓ అంతస్తులోకి దూసుకుపోయింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో భవనం స్వల్పంగా ధ్వంసం అయింది. ఈ ఘటన ధాటికి భవనంపై అంతస్తుల నుంచి శిథిలాలు, విమాన భాగాలు కింద ఉన్న రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలు అక్కడ ఏం జరుగుతోందని భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ విమాన ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను చైనా స్థానిక అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేదా ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కాగా, చైనా రాజధాని బీజింగ్‌లోనే అతిపెద్దదైన ఈ భవనాన్ని ‘చైనా జున్’ (China Zun)గా పిలుస్తుంటారు. దీని ఎత్తు 528 మీటర్లు (1732 అడుగులు). పురాతన చైనీస్ వైన్ పాత్ర ఆకారంలో దీన్ని నిర్మించడం విశేషం.






