- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్-నయనతార సినిమాపై హైప్ పెంచేసిన దిల్ రాజు.. ఆసక్తికర కామెంట్స్ వైరల్
మూవీ షూటింగ్ చాలా స్పీడ్‌గా జరుగుతోందని, రాబోయే ఆరు నెలల్లో అంటే సరిగ్గా అక్టోబర్ నాటికి మొత్తం చిత్రీకరణ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాగా.. షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. అయితే ఇందులో సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 63వ ప్రాజెక్ట్. అయితే ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం సల్మాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దిల్ రాజు సల్మాన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు దిల్ రాజు ఒక క్లారిటీ ఇచ్చారు.
మూవీ షూటింగ్ చాలా స్పీడ్‌గా జరుగుతోందని, రాబోయే ఆరు నెలల్లో అంటే సరిగ్గా అక్టోబర్ నాటికి మొత్తం చిత్రీకరణ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. సల్మాన్ ఖాన్ గారు కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారని, షూటింగ్ లొకేషన్‌లో ఆయన చాలా హ్యాపీగా ఉంటున్నారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. సినిమా అవుట్‌పుట్ ఎలా వస్తుందనే దానిపై దిల్ రాజు స్పందిస్తూ.. "మేము ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షూటింగ్ ఫుటేజ్ చూశాము, అవి నిజంగా అద్భుతంగా వచ్చాయి. సినిమాలో ఒక రేంజ్ వావ్ ఫ్యాక్టర్ ఉంది. ఖచ్చితంగా మేము ఒక భారీ బ్లాక్‌బస్టర్‌ను ఆశిస్తున్నాము" అంటూ హైప్ పెంచేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ లుక్స్ చాలా డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా ఉంటాయని, ఇప్పటికే చిత్రీకరించిన ఒక పాట కూడా విజువల్స్ పరంగా చాలా అద్భుతంగా వచ్చిందని దిల్ రాజు కామెంట్స్ చేశారు.






