- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎరిమలె వాగులో పేరుకుపోయిన గుర్రపు డెక్క
సర్కిల్ పరిధిలోని ఎరిమలె వాగులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు విషయంలో అధికారుల ఉదాసీన వైఖరిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.

దిశ, ఘట్కేసర్: సర్కిల్ పరిధిలోని ఎరిమలె వాగులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు విషయంలో అధికారుల ఉదాసీన వైఖరిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సర్కిల్ పరిధిలోని కాలువల్లో పూడిక తీత పనులు నామమాత్రంగా ప్రారంభించిన మున్సిపల్ అధికారులు పనులు పూర్తి చేయకుండానే చేతులెత్తేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాలువలు కోళ్ళ వ్యర్ధాల డంపింగ్ కేంద్రాలుగా మారిపోతున్నాయి. పరిసరాలు దుర్వాసనతో కంపు కొట్టడమే కాకుండా దోమల బెడద పెరిగిపోయిందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నామ మాత్రంగా పూడిక తీత పనులు...
రాంపల్లి నుంచి ఎదులాబాద్ లక్ష్మీ నారాయణ చెరువు వరకు బొంతకుంట వాగు ఎరిమలె వాగులో కలిసి ప్రవహిస్తూ ఉంటుంది. ఘట్కేసర్, యంనంపేట, శివారెడ్డి కూడా, బొక్కోనిగూడ ప్రాంత ప్రజలకు ప్రధాన జలవనరుగా పేరుగాంచిన ఎరిమలె వాగు ప్రస్తుతం గుర్రం డెక్క చేరి కాలుష్యం కంపు కొడుతోంది. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపు తలెత్తకుండా సర్కిల్ పరిధిలో కాలువల్లో ముందస్తుగా పూడిక తీత పనులు ప్రారంభించారు. కానీ కాల్వలో పుడితే పనులు పూర్తి చేయకుండానే అధికారులు చేతులెత్తేశారు. అయితే పుడుకతీత పనులు చేసినట్లుగా కాంట్రాక్టర్కు నిధులు మంజూరు చేశారనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో సమస్యలను ఎదుర్కొనేందుకు వివిధ శాఖల అధికారులతో ఘట్కేసర్ డిప్యూటీ కమిషనర్ వాణి మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిన్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.
కంపు కొడుతున్న కాలువలు...
ఎరిమలె వాగుపై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు కోడి మాంసం వ్యర్ధాలు కాలువల్లో డంప్ చేస్తున్నారు. దీంతో ఎరిమలె వాగు దుర్వాసనతో కంపు కొడుతోంది. అంతే కాకుండా గుర్రపు డెక్కతో పాటు దోమల బెడద కూడా పెరిగింది. దోమల కారణంగా ఆరోగ్యం పాలవుతామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం విషయంలో చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.






