ఇప్పటివరకు నేను సాధించిన గొప్ప విజయాలలో ఇది ఒకటి.. మారి సెల్వరాజ్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నాకు ఇళయరాజా సార్‌తో కలిసి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో బలమైన కోరికగా ఉండేది. కేవలం ఆయన కోసమే నేను ఈ సినిమా చేస్తున్నాను.

ఇప్పటివరకు నేను సాధించిన గొప్ప విజయాలలో ఇది ఒకటి.. మారి సెల్వరాజ్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ దర్శకుడు మారి సెల్వరాజ్ బలమైన కథలతో విమర్శలకు ప్రశంసలు అందుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి స్టార్ హీరో ధనుష్‌తో ‘D56’ కాగా, మరొకటి ప్రతిష్టాత్మక చిత్రం ‘మంజనాథి’. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, షూటింగ్ పనులను కూడా ప్రారంభించింది. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు సంగీతం అందిస్తుండటం విశేషం. ఇందులో కాయదు లోహర్, ప్రియాంక మోహన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మారి సెల్వరాజ్.. ఇళయరాజాతో తనకున్న వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. "నేను ప్రస్తుతం ఒకే సమయంలో రెండు క్రేజీ సినిమాలకు పని చేస్తున్నాను.ఒకటి ధనుష్ గారు హీరోగా, ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ గారి మ్యూజిక్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం.

కాగా, మరొకటి ఇళయరాజా గారి అద్భుతమైన సంగీతంతో రూపొందుతున్న 'మంజనాథి' మూవీ. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇద్దరు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లతో ఒకే సమయంలో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం" అని చెప్పారు. అంతేకాకుండా ఇళయరాజాతో పని చేయడంపై మారి సెల్వరాజు మాట్లాడుతూ.. "నాకు ఇళయరాజా సార్‌తో కలిసి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో బలమైన కోరికగా ఉండేది. కేవలం ఆయన కోసమే నేను ఈ సినిమా చేస్తున్నాను. గత పది రోజులుగా ఆయనతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నాను. ఇది నాకు మాటల్లో చెప్పలేనంత భావోద్వేగభరితమైన అనుభూతిని ఇస్తోంది. ఆయనతో గడిపిన ఈ కొద్ది రోజుల్లోనే నాలో ఉన్న కోపం, అసహనం, బాధ, సోషల్ మీడియా లేదా మనుషుల పట్ల ఉండే నెగెటివ్ భావాలన్నింటి నుండి నాకు ఒక రకమైన ఉపశమనం లభించింది. ఈ సినిమా నా జీవితాన్ని ఒక పండుగలా సంబరంగా జరుపుకునేలా చేస్తోంది. ఇప్పటివరకు నా కెరీర్‌లో నేను సాధించిన గొప్ప విజయాలలో ఇది కూడా ఒకటిగా భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

Next Story