గండిపేటలో మున్సిపల్ కూల్చివేతలు.. 50కి పైగా షెడ్లు, డబ్బాలు తొలగింపు

by Taduka Kalyani |

నార్సింగి సర్కిల్ పరిధిలోని గండిపేటలో రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్లు, డబ్బాలపై మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేత చర్యలు చేపట్టారు.

గండిపేటలో మున్సిపల్ కూల్చివేతలు.. 50కి పైగా షెడ్లు, డబ్బాలు తొలగింపు
X

దిశ, గండిపేట: నార్సింగి సర్కిల్ పరిధిలోని గండిపేటలో రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్లు, డబ్బాలపై మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేత చర్యలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద, టీపీఓ రమేష్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తుతో ఈ డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 99 డేస్ ప్రణాళికలో భాగంగా అనుమతులు లేకుండా షట్టర్ల ముందు ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు. గోల్కొండ రిసార్ట్ నుంచి సాయిబాబా ఆలయం వరకు, అక్కడి నుంచి ఇంద్రారెడ్డి విగ్రహం వరకు, అలాగే గండి మైసమ్మ కమాన్ నుంచి యూనియన్ బ్యాంక్ వరకు ప్రత్యేకంగా కూల్చివేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 డబ్బాలు, షెడ్లను అధికారులు తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ అధికారులు, చైన్‌మెన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story