- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ల్యాప్‌టాప్ చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్
బెట్టింగ్ వ్యసనాలకు బానిసైన యువకుడు దొంగతనాలకు పాల్పడుతూ రాయదుర్గం పోలీసులకు చిక్కాడు

దిశ, శేరిలింగంపల్లి : బెట్టింగ్ వ్యసనాలకు బానిసైన యువకుడు దొంగతనాలకు పాల్పడుతూ రాయదుర్గం పోలీసులకు చిక్కాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ల్యాప్‌టాప్ చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు నాగిశెట్టి జశ్వంత్(23 ) అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చేశాడు. స్వస్థలం బలిజా వీధి, రొంపిచర్ల, చిత్తూరు జిల్లా డెలివరీ బోయ్ ఉద్యోగం వదిలి ఆన్‌లైన్ బెట్టింగ్ లో జూదం ఆడే అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులను తీర్చేందుకు గత ఆరు నెలలుగా రాయదుర్గం చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో ల్యాప్‌టాప్ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఖాజాగూడలోని ఎంఆర్ గ్రాండ్ హాస్టల్లో జరిగిన మూడు ల్యాప్‌టాప్ చోరీ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. రాయిదుర్గం వెంకన్న, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ భూపతి,ఎస్ ఐ రామస్వామి, క్రైమ్ టీమ్ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో గంగను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గత ఐదు నెలల కాలంలో నిందితుడు మొత్తం 8 ల్యాప్‌టాప్‌లను దొంగిలించినట్లు విచారణలో తేలింది. వాటిలో నాలుగు ల్యాప్‌టాప్‌లను కాసిఫి యాప్ ద్వారా విక్రయించగా, మిగిలిన 2.5 లక్షల విలువైన నాలుగు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు, మాధాపూర్ ఒక కేసు నమోదైనట్లు విచారణలో వెల్లడైంది.






