- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతగిరిలో ఉప్పల్ బాలు ‘రీల్స్’ రచ్చ.. అటవీ అధికారుల ఎంట్రీతో క్షమాపణలు!
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ఎంతటి ప్రమాదకర స్టంట్స్ చేయడానికైనా వెనుకాడట్లేదు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ ‘ఉప్పల్ బాలు’ వికారాబాద్ అనంతగిరి కొండల్లో చేసిన వింత చేష్టలు తీవ్ర దుమారం రేపాయి.

దిశ, డైమనిక్ బ్యూరో : సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ఎంతటి ప్రమాదకర స్టంట్స్ చేయడానికైనా వెనుకాడట్లేదు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ ‘ఉప్పల్ బాలు’ వికారాబాద్ అనంతగిరి కొండల్లో చేసిన వింత చేష్టలు తీవ్ర దుమారం రేపాయి. ప్రశాంతమైన అటవీ, పుణ్యక్షేత్ర వాతావరణంలో రొడ్డుపై ఆగి ఉన్న కారుపైకెక్కి బాలు చేసిన రీల్స్‌పై అటవీ శాఖ అధికారులు సీరియస్ అవ్వడంతో.. చివరకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసలేం జరిగిందంటే..?
ప్రముఖ పర్యాటక ప్రాంతం, పుణ్యక్షేత్రమైన అనంతగిరి ఘాట్ రోడ్డుపై ఉప్పల్ బాలు తన అనుచరులతో కలిసి హల్ చల్ చేశాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో మహీంద్రా థార్ (Thar) కారు టాప్, బోనెట్ మీద కూర్చొని రీల్స్ చేశాడు. రొడ్డుపై రీల్స్ చేయడంతో ఆ ప్రాంతంలో చాలా మంది గుమిగూడారు. అతను రీల్స్ చేసే సమయంలో ఒక బైకర్‌కు అడ్డుగా వెళ్లినట్లు వీడియోలో కన్పిస్తోంది. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానికులు, భక్తులు మండిపడ్డారు. రొడ్డుపై హాల్ చల్ చేసిన బాలుపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సైతం డిమాండ్ చేశారు.
రంగంలోకి అటవీ అధికారులు.. కేసు నమోదు!
ఈ వ్యవహారంపై వికారాబాద్ అటవీ శాఖ (Forest Department) అధికారులు తక్షణమే స్పందించారు. అభయారణ్య పరిధిలోకి వచ్చే అనంతగిరి కొండల్లో ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ.. ఉప్పల్ బాలుపై అధికారికంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, వీడియోలో ఉన్న కారును గుర్తించి, దానికి సంబంధించిన వ్యక్తులను కూడా విచారించే పనిలో పడ్డారు. వ్యూస్ కోసం పర్యాటకుల భద్రతకు, పర్యావరణానికి ముప్పు తెస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తప్పు తెలుసుకున్న బాలు..
అటవీ అధికారులు కేసు నమోదు చేసి, విమర్శలు వెల్లువెత్తడంతో ఉప్పల్ బాలు వెనక్కి తగ్గాడు. తన చర్యలపై వివరణ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా క్షమాపణలు కోరాడు. ‘మా బావ కొత్త కారు కొనడంతో అక్కడికి వెళ్లాం. కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసమే అలా చేశాను తప్ప.. వాహనదారులను, ఇతరులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నేను చేసింది తప్పైతే.. దయచేసి నన్ను క్షమించండి’ అని బాలు ప్రాధేయపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ.. సోషల్ మీడియా పిచ్చితో పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.






