- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లయిన నెలకే విషాదం.. కోతులు చుట్టుముట్టడంతో గుట్టపై నుంచి పడి నవ వధువు మృతి!
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహమైన నెల రోజులకే ఓ నవ వధువు ఆలయ గుట్టపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. కోతులు చుట్టుముట్టడంతో ఆందోళనకు గురై ఆమె కిందకు పడిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సౌత్ తిట్టంకుళం ప్రాంతానికి చెందిన అనిత (24), విదేశాల్లో పనిచేస్తున్న సురేశ్ (29)లకు నెల క్రితమే వివాహమైంది. ఈ దంపతులు కలుగుమలైలోని కలుగసలమూర్తి ఆలయ దర్శనానికి వెళ్లారు. ప్రధాన ఆలయంలో పూజల అనంతరం గుట్టపై ఉన్న ఉచ్చిపిళ్లయార్ గుడికి చేరుకున్నారు. అక్కడ వారు కోతులకు పండ్లు తినిపిస్తుండగా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కోతులు వారిని చుట్టుముట్టాయి.
తీవ్ర భయాందోళనలకు గురైన అనిత.. అదుపుతప్పి గుట్టపై నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లెదుటే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడివారిని కలచివేసింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.






