- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రెండు గంటల్లో ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాలకు రాబోయే రెండు గంటల పాటు భారీ వర్ష సూచన (Heavy Rain Alert) ఉన్నట్లు 'తెలంగాణ వెదర్' విభాగం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని పలు జిల్లాలకు రాబోయే రెండు గంటల పాటు భారీ వర్ష సూచన (Heavy Rain Alert) ఉన్నట్లు 'తెలంగాణ వెదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షాలు (Intense Rains) కురుస్తున్నాయి. ఈ మేఘాలు మరింత విస్తరించి రాగల రెండు గంటల్లో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాలను కమ్మేయనున్నాయి. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన చాలా బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ స్పష్టం చేసింది.
మరోవైపు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలో రాబోయే రెండు గంటల్లో మరింత తీవ్రమైన మేఘాలు అంచెలంచెలుగా విస్తరించనున్నాయి. దీనివల్ల ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఇక హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నగరం అంతటా ఆకాశం పూర్తిగా మబ్బుపట్టి (Cloudy) ఉంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. అయితే, ఈరోజే మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం వేళల్లో నగరంలో సరికొత్తగా బలమైన వర్షపు మేఘాలు దట్టంగా అలుముకుని, పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెదర్ మ్యాన్ అంచనా వేశారు.






