- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి త్యాగం చిరస్మరణీయం.. పునరావాసం కల్పిస్తాం: సీఎం చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టు బాధిత రైతులకు పునరావాసం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: వెలిగొండ ప్రాజెక్టు(Veligonda Project) బాధిత రైతులకు పునరావాసం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లె(Markapuram District Gantavanipalle)లో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను త్యాగం చేశారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల భవిష్యత్తును మార్చబోతోందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురానికి నీళ్లు ఇవ్వాలని నందమూరి తారకరామారావు చాలా ఆలోచించారని, ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా వెలిగొండ గురించే అడిగేవారని చంద్రబాబు గుర్తు చేశారు. మార్కాపురమంటేనే కరువు ప్రాంతమని, ఇక్కడికి కృష్ణా జలాలు వస్తాయనే ఊహ కూడా ఉండేదనికాదన్నారు. 1996లో తానే వెలిగొండకు పునాది వేశానని, పునరావాసానికి రూ.300 కోట్లు అందజేశామని చంద్రబాబు నాయుడు తెలిపారు.






