కొండపై ప్రీ-వెడ్డింగ్ షూట్‌కు జాగ్రత్త! పుణె ఘటన నేపథ్యంలో వైరల్ అవుతున్న ఫన్నీ రీల్

by Ramesh Naini |

మహారాష్ట్రలోని లోహగడ్ కోట వద్ద జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

కొండపై ప్రీ-వెడ్డింగ్ షూట్‌కు జాగ్రత్త! పుణె ఘటన నేపథ్యంలో వైరల్ అవుతున్న ఫన్నీ రీల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని లోహగడ్ కోట వద్ద జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ భయానక ఘటన నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితులపై సెటైర్లు వేస్తూ రూపొందించిన ఓ ఫన్నీ ప్రీ-వెడ్డింగ్ రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తుపాకులతో బాడీగార్డ్స్.. నెటిజన్ల సెటైర్లు

కొండ అంచున రొమాంటిక్‌గా ఫొటోషూట్ చేసుకుంటున్న జంట పక్కనే.. నకిలీ గన్ పట్టుకుని బాడీ గార్డ్స్ పహారా కాయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ‘ప్రస్తుత రోజుల్లో ప్రీ-వెడ్డింగ్ షూట్‌కి లేదా హనీమూన్‌కి కొండల మీదకు వెళ్లాలంటే.. ఇలాంటి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండాల్సిందే!’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, గతంలో ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేసిన యువతుల ఫోటోలను రీల్‌కు జోడించడం గమనార్హం.

పక్కా ప్లాన్‌తో లోయలోకి తోసి హత్య!

పుణె నగరానికి చెందిన 25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను అతడి కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి పక్కా పథకం ప్రకారం హత్య చేసింది. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఈ హత్య ప్లాన్ మొత్తం సియా గోయల్ ఆలోచనే అని విచారణలో తేలింది. ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. జూన్ 18న కేతన్‌ను మహారాష్ట్రలోని లోహగడ్ కోట వద్దకు తీసుకెళ్లారు. ముందే అనుకున్న సిగ్నల్ ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తూ సియా ఉన్నట్టుండి కింద కూర్చుంది. సియా కింద కూర్చోగానే, అప్పటికే వెనుక నక్కి ఉన్న ప్రియుడు చేతన్ చౌదరి ఒక్కసారిగా వచ్చి కేతన్‌ను 350 అడుగుల లోతైన లోయలోకి తోసేశాడు. సలేం జరుగుతుందో, ఎందుకు కిందకు పడిపోతున్నాడో బాధితుడు గ్రహించేలోపే.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా, అబ్బాయిల భద్రతపై నెట్టింట ఈ ఫన్నీ వీడియో చర్చకు దారితీస్తోంది.

Next Story