‘దిశ’ ఎఫెక్ట్.. ఇస్నాపూర్‌లో చెత్త తొలగింపు

by Jakkula.Mamatha |

ఇస్నాపూర్ - మైలారం ప్రధాన రోడ్డుపై చెత్త చెదారం, బురద నిండుకొనిపోయి స్థానికులు ఇబ్బందులు పడుతున్న అంశంపై "కంపు కొడుతున్న ఇస్నాపూర్" పేరిట ‘దిశ’లో శనివారం వచ్చిన వార్తకు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించారు.

‘దిశ’ ఎఫెక్ట్.. ఇస్నాపూర్‌లో చెత్త తొలగింపు
X

దిశ, పటాన్ చేరు టౌన్: ఇస్నాపూర్ - మైలారం ప్రధాన రోడ్డుపై చెత్త చెదారం, బురద నిండుకొనిపోయి స్థానికులు ఇబ్బందులు పడుతున్న అంశంపై "కంపు కొడుతున్న ఇస్నాపూర్" పేరిట ‘దిశ’లో శనివారం వచ్చిన వార్తకు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మోటర్ సుమలత శ్రీకాంత్, మున్సిపల్ చైర్మన్ వెంకట కిషన్ రావు క్లీనింగ్ కు సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు పేరుకుపోయిన చెత్తను, నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించాల్సిందిగా మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో తొలగించారు. అలాగే రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు కారణంగా పేరుకుపోయిన బురదను కూడా తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు, ముఖ్యంగా దుకాణదారులు చెరువు వ్యాపారాలు చెత్తను రోడ్డుపై పారవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పజెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Next Story