- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన హీరోలు బాలీవుడ్ స్టార్స్‌ని చూసి ఆ అద్భుతమైన విషయం నేర్చుకోవాలి.. హాట్ టాపిక్‌గా మారిన దిల్‌రాజు కామెంట్స్
కవేళ రెమ్యునరేషన్ తగ్గిస్తే ఎక్కడ తమ మార్కెట్ వాల్యూ, ఇమేజ్ తగ్గిపోతాయో అని హీరోలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

దిశ, సినిమా: ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలను బాలీవుడ్ వారితో పోలుస్తూ.. సంచలన విషయాలను వెల్లడించడం గమనార్హం. సినిమాల బడ్జెట్‌లు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం హీరోల రెమ్యునరేషన్లే అని దిల్ రాజు స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక సినిమాను రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తీస్తుంటే.. అందులో దాదాపు 35 నుండి 40 శాతం వరకు కేవలం ఒక్క హీరో రెమ్యునరేషన్ రూపంలోనే వెళ్ళిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన టాలీవుడ్ హీరోలకు ఈగోలు ఎక్కువని, అందువల్ల ఏ హీరో కూడా తన పారితోషికం తగ్గించుకోవడానికి అస్సలు రెడీగా లేరని దిల్ రాజు అనడం గమనార్హం. ఒకవేళ రెమ్యునరేషన్ తగ్గిస్తే ఎక్కడ తమ మార్కెట్ వాల్యూ, ఇమేజ్ తగ్గిపోతాయో అని హీరోలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు హీరోలకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితి ఏంటో స్పష్టంగా వివరిస్తానని దిల్ రాజు చెప్పారు. సినిమా బిజినెస్ రేంజ్‌ను బట్టి తాను ఎంతవరకు రెమ్యునరేషన్ ఇవ్వగలనో ముందే చెప్తానని, తన ప్లానింగ్ అర్థం చేసుకున్న హీరోలతోనే తాను సినిమాలు చేస్తానని వివరించారు. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు వచ్చిందని దిల్ రాజు ప్రశంసలు కురిపించారు.
అక్కడ స్టార్స్ అందరూ ముందే భారీగా రెమ్యునరేషన్లు తీసుకోకుండా.. సినిమా లాభాల్లో వాటా తీసుకునే ప్రాఫిట్ షేరింగ్ మోడల్ పద్ధతిని ఫాలో అవుతున్నారని చెప్పారు. గతంలో అక్షయ్ కుమార్ ఒక సినిమాకు రూ. 130 కోట్లు తీసుకునేవారని, కానీ వరుస డిసాస్టర్లు రావడంతో రియాలిటీని గ్రహించి ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ పద్ధతికి మారిపోయారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు మన టాలీవుడ్‌లో ఇంకా ఈ పద్ధతి స్టార్ట్ కాలేదని, టాలీవుడ్ స్టార్స్ కూడా త్వరలోనే ఈ పద్ధతిని అలవాటు చేసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. అలాగే ‘గేమ్‌ఛేంజర్’కు రూ.186 కోట్ల మొదటి రోజు పోస్టర్ వివాదంపైపై దిల్‌రాజు స్పందిస్తూ, నేటి కలెక్షన్ పోస్టర్లు ఎక్కువగా అభిమానుల మధ్య జరిగే యుద్ధాలు, సోషల్ మీడియా ఒత్తిడి వల్లే రూపొందుతున్నాయని అంగీకరించారు. నిర్మాతలకు అసలు వసూళ్లు తెలుసని, కానీ అబద్ధపు ప్రచారం ఒక సినిమాను కాపాడలేదని ఆయన వెల్లడించారు. అలాగే, ఆలస్యం ‘గేమ్‌ఛేంజర్’ ను దెబ్బతీసిందని, దాని కంటెంట్‌ను పాతదిగా అనిపించేలా చేసిందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బాలీవుడ్ హీరోలతో పోలుస్తూ టాలీవుడ్ స్టార్స్‌ను తక్కువ చేసి మాట్లాడటం ఏంటని దిల్ రాజును ప్రశ్నిస్తున్నారు. మన హీరోల వల్లే పాన్ ఇండియా రేంజ్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీకి అంత గుర్తింపు వస్తుంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ నెట్టింట నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.






