- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు భరోసా దరఖాస్తులకు జూలై 5 వరకు అవకాశం: వ్యవసాయ అధికారి ప్రియదర్శిని
by Jakkula.Mamatha |
ఈ నెల(జూన్) 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ,వంగూరు: ఈ నెల(జూన్) 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోని కొత్త రైతులు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. దరఖాస్తుదారులు భూమి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను జత చేసి దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు(ఏఈవో) జూలై 5వ తేదీలోగా సమర్పించాలని కోరారు. ఇప్పటికే రైతు భరోసా పథకం లబ్ధి పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Next Story






