ఎస్ఆర్ నగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు..

by Taduka Kalyani |

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూనగర్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు.

ఎస్ఆర్ నగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు..
X

దిశ, ఖైరతాబాద్ : ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూనగర్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో బాపూనగర్‌లో 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఎస్ఆర్ నగర్ ఎస్సై పీ. సుధీర్ రెడ్డి** తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా పెరమ్ వివేక్ సిద్ధి అలియాస్ బన్నీ (23), బండారి హరికృష్ణ (25), సైని సాయికిరణ్ (24), ముంజి అఖిల్ కుమార్ (22)లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బాపూనగర్‌లోని ఓ పెంట్‌హౌస్‌లో ఉంటూ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో గంజాయిని నిల్వ చేసి, ప్యాకింగ్ చేసి, కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో అనిల్ , గగన్ , ప్రణయ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, గంజాయి సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Next Story