అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

by Kodari Anjali |

జోగులాంబ గద్వాల జిల్లాలో 64 అంగన్వాడీ టీచర్లు, 9 అంగన్వాడీ ఆయాలు మొత్తం 73 పోస్టులు ఖాళీలు ఉన్నందున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
X

దిశ, గద్వాల కలెక్టరేట్: జోగులాంబ గద్వాల జిల్లాలోని (3) ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ కార్యాలయ పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు,గి రిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ గద్వాల అర్బన్ ప్రాజెక్టులో 28 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 5 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టులు కలిపి మొత్తం 33 పోస్టులు, ఐసీడీఎస్ మల్దకల్ ప్రాజెక్టులో 22 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 4 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టులు కలిపి మొత్తం 26 పోస్టులు, ఐసీడీఎస్ మానవపాడు ప్రాజెక్టులో 14 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టులలో కలిపి మొత్తం 64 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 9 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టులు, మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 29వ తేదీ నుంచి జూలై 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలు, నిబంధనలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ అయిన https://www.wdcw.tg.nic.in/ ను సందర్శించాలని సూచించారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ఈ నియామక ప్రక్రియను ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story