- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా విభాగంలో మరో కీలక నియామకం చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా విభాగంలో మరో కీలక నియామకం చేపట్టింది. ఇన్వెస్ట్ తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా కొనసాగుతున్న సీనియర్ అధికారి అజిత్ రెడ్డి (IDES-2012)కి ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆయనను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ (Addl. MD) గా నియమిస్తూ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఐటీ అండ్ సీ (I&C) శాఖ పరిధిలోని 'ఇన్వెస్ట్ తెలంగాణ' సీఈఓగా సేవలు అందిస్తున్న అజిత్ రెడ్డికి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీ పోస్టుకు సంబంధించిన పూర్తి అదనపు బాధ్యతలను (Full Additional Charge - FAC) అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులు వేగవంతం అవుతున్న తరుణంలో, ఈ కీలక పోస్టులో అజిత్ రెడ్డి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.






