- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక మంచి తోడు కోసం ఎదురుచూస్తున్నాను.. పెళ్లిపై రియా చక్రవర్తి కామెంట్స్
తన ప్రస్తుత మానసిక స్థితిని వివరించడానికి ఆమె పరిణతి చెందిన అనే పదాన్ని ఉపయోగించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ రియా చక్రవర్తి చాలాకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2020లో తన ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జైలుకి వెళ్లిన ఆమె ఆ సమయంలో ఎదుర్కొన్న తీవ్రమైన పరిస్థితులు, ఆ తర్వాత తన జీవితంలో మిగిలిన మానసిక క్షోభ గురించి పలు ఇంటర్వ్యూలో పంచుకుంటున్నారు. ఇంకా ఆ బాధ నుండి కోలుకోలేదని అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. తాజాగా, యూట్యూబ్ టాక్ షో ‘డబుల్ డేట్’ లో తన తమ్ముడు షోవిక్ చక్రవర్తితో కలిసి పాల్గొన్న రియా.. తమ ప్రస్తుత జీవితం, రిలేషన్‌షిప్స్, పెళ్లిపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తనకు భాగస్వామి కావాలనే కోరిక ఏమీ లేదని, కానీ భవిష్యత్తులో ఒక మంచి తోడు దొరకాలని అనుకుంటున్నాను. అలాగే నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే బాగుంటుందని రియా పేర్కొన్నారు. తన ప్రస్తుత మానసిక స్థితిని వివరించడానికి ఆమె పరిణతి చెందిన అనే పదాన్ని ఉపయోగించారు.
ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకంటే ముందే తన తమ్ముడు షోవిక్ పెళ్లి చేసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. దానికి షోవిక్ స్పందిస్తూ.. అక్క పెళ్లి అయిన తర్వాతే తాను చేసుకుంటానని నవ్వుతూ బదులిచ్చాడు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌సిబి రియాను, ఆమె తమ్ముడిని అరెస్ట్ చేసిన రోజులను గుర్తుచేసుకుంటూ.. ఆ చేదు జ్ఞాపకాల నుండి తాము ఇంకా పూర్తిగా బయటపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. "ట్రామా అనేది అంత తేలిగ్గా పోయేది కాదు. అది మనసులోనే కాదు, మీ శరీరంలో కూడా ఉండిపోతుంది. మేము ఇప్పటికీ పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్నాము" అని రియా చెప్పారు. తాము రెగ్యులర్‌గా థెరపీ తీసుకుంటూ ఆ సమస్య నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.






