- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరగిరి రోడ్డు పనులు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాస్తారోకో..
నల్లమల అడవుల్లో ఉన్న అమరగిరి గ్రామానికి బీటీ రోడ్డు పునర్ నిర్మాణం విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు.

దిశ, కొల్లాపూర్: మండలంలోని నల్లమల అడవుల్లో ఉన్న అమరగిరి గ్రామానికి బీటీ రోడ్డు పునర్ నిర్మాణం విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. పట్టణంలోనీ ఎన్టీఆర్ చౌరస్తాలో ఎర్ర జెండాలను చేతబూని రాస్తా రోకో చేశారు. అనంతరం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రదర్శనగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకునీ ధర్నా చేశారు. అనంతరం ఆర్డీఓ బన్సీలాల్ కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ మాట్లాడుతూ, అమరగిరి బీటీ రోడ్డు పునర్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ,3 కోట్లు ఎం ఆర్ఆర్ గ్రాంట్స్ కింద మంజూరు చేస్తే.. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు 17 నెలల క్రితం శంకు స్థాపన చేశారని గుర్తు చేశారు. అమరగిరి రోడ్డు పై ప్రభుత్వానికి ఎందుకింత సమితి తల్లి ప్రేమ అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధికి నోచుకోని అమరగిరి గ్రామానికి తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. 2025 ఫిబ్రవరి 8వ తేదీన పంచాయతీరాజ్ ఆర్ నిధుల నుండి కొల్లాపూర్ పట్టణం నుండి అమరగిరి వరకు బీటి రోడ్డు నిర్మాణానికి రూ, 3కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ పనులకు స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారని ఆయన తెలిపారు.
ఒకపక్క గ్రామస్తులను పీడిస్తూ...
కానీ 17 నెలలు గడిచిన నేటికీ రోడ్డు పనులకు మోక్షం లభించలేదన్నారు. సంవత్సరాల క్రితం అరకొరగా వేసిన రోడ్డు పాడైపోయి అనేక వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనీ ఫయాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమరగిరి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడపక విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ ఆయన పేర్కొన్నారు. అడవి ప్రాంతం కావడం ద్వారా పాములు తేళ్లు కాటుకు గురైనప్పుడు అనారోగ్యాలకు సమస్య వచ్చినప్పుడు పట్టణానికి చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యం లేక చాలామంది మృత్యువాత పడడం, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఒకపక్క గ్రామస్తులను పీడిస్తూ ఉంటే ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రి జూపల్లి స్పందించి బీటీ రోడ్డు పునర్ నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు సింగోటం, మాజీ సర్పంచ్ ఆర్ ఇందిర, సీపీఐ కొల్లాపూర్ పట్టణ కార్యదర్శి ఎం డి యూసుఫ్, అమరగిరి గ్రామ మాజీ ఉపసర్పంచ్ మల్లేష్, గ్రామ పెద్దలు నారాయణ, శివ కృష్ణ, సీపీఐ నాయకులు చందు, చాపల శేఖర్, కృష్ణయ్య శంకరయ్య మదిలేటి తదితరులు పాల్గొన్నారు.






