- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టులో ఇక ఫుల్ సిగ్నల్.. భక్తుల కోసం మొబైల్ టవర్ ఏర్పాటు
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మొబైల్ టవర్ ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి.

దిశ, కొండగట్టు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మొబైల్ టవర్ ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు దేవస్థానం ఇండస్ టవర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. టవర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు నాణ్యమైన మొబైల్ సిగ్నల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇండస్ టవర్స్ సంస్థ ప్రతినిధులు దేవస్థానాన్ని సందర్శించి టవర్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి హరిహరనాథ్, పర్యవేక్షకులు సునీల్ కుమార్‌తో కలిసి టవర్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. భక్తులకు మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించేలా నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు. మొబైల్ టవర్ ఏర్పాటు పూర్తయితే కొండగట్టు ఆలయ పరిసరాల్లో ఎదురవుతున్న మొబైల్ నెట్‌వర్క్ సమస్యలకు పరిష్కారం లభించి, భక్తులు అత్యవసర సమయాల్లో సులభంగా కమ్యూనికేషన్ సౌకర్యాలను వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది.






