కులాల పేర్లతో హోటళ్లు ఎన్నో ఉన్నా.. ‘మాదిగ బిర్యానీ హౌజ్’పైనే చర్చ ఎందుకు?

by Sujitha Rachapalli |

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ హోటల్ పేరు ఫుల్లుగా వైరల్ అయిపోయింది. పెద్ద చర్చకే దారితీసింది. విషయం ఏంటంటే.. కులాల పేర్లతో హోటల్ నేమ్స్‌ పెట్టి.. తమ కులాల వారిని అట్రాక్ట్ చేయడం సాధారణం.

కులాల పేర్లతో హోటళ్లు ఎన్నో ఉన్నా.. ‘మాదిగ బిర్యానీ హౌజ్’పైనే చర్చ ఎందుకు?
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ హోటల్ పేరు ఫుల్లుగా వైరల్ అయిపోయింది. పెద్ద చర్చకే దారితీసింది. విషయం ఏంటంటే.. కులాల పేర్లతో హోటల్ నేమ్స్‌ పెట్టి.. తమ కులాల వారిని అట్రాక్ట్ చేయడం సాధారణం. లేదంటే తమ కులం మీద ఉన్న అభిమానంతో పేర్లు పెట్టుకోవడం చాలా నేచురల్. ఉదాహరణకు ‘రెడ్డి గారి హోటల్‍’, ‘నాయుడు గారి బిర్యానీ’, ‘చౌదరి గారి మెస్‍’, ‘బ్రాహ్మణ భోజనం’, ‘ఆర్యవైశ్య భోజనశాల’.. ఇలా ప్రతీ కులానికి చెందిన వారు తమ తమ కులాల పేర్లు పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇవి ఎగువ కులాల వారే పెట్టుకుంటారనేది.. తమ బ్రాండ్‌ను ఇలా క్రియేట్ చేసుకుంటారనేది ఎక్స్‌పర్ట్స్ చెప్పే మాట. అయితే ఈ మధ్య వైరల్ అవుతున్న విషయం ఏంటంటే.. ‘మాదిగ బిర్యానీ హౌజ్’.. అంటే సమాజంలో తక్కువ కులంగా పేరు పొందిన మాదిగలు(SC).. మేము ఎవరికంటే తక్కువ కాదని, అందరి లాగా తామెందుకు బ్రాండ్ క్రియేట్ చేయొద్దనే ఈ హోటల్‌ను ప్రారంభించారు.

ఒకప్పుడు.. ఇప్పుడు..

ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మనుషుల లైఫ్ స్టైల్‌లో మాత్రమే కాదు మనుషులు ఎదుటి మనిషిని ట్రీట్ చేసే విధానంలోనూ చాలా తేడా వచ్చింది. ఒకప్పుడు ఎక్కువ కులం వాళ్లు అంటే.. తక్కువ కులానికి చెందిన ఇంటి వైపు వెళ్లకపోయేది. ఒకవేళ వెళ్లినా.. వాళ్ల ఇంట్లో నీళ్లు కూడా తాగేందుకు నిరాకరించేది. ఇక భోజనం సంగతి దేవుడెరుగు. ఇక ఎక్కువ కులానికి చెందిన వ్యక్తులు.. మాదిగ కాలనీకి వెళ్తే.. కచ్చితంగా గౌరవించాలి. నమస్కరించాలి. కానీ ఇప్పుడు.. జనరేషన్స్ మారాయి. తక్కువ కులం ఏంటి.. ఎక్కువ కులం ఏంటి.. అందరికీ ఒకే నీరు.. అందరిదీ అదే తిండి.. అందరూ ఒక్కటే అనే ఆలోచన వచ్చేసింది. అందరి మధ్య స్నేహాలు కూడా పెరిగాయి. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి తినేంత చనువు కూడా వచ్చేసింది. చాలా పల్లెటూర్లలో తప్పితే.. ఇలాంటి పరిస్థితులు ఆల్మోస్ట్ సేమ్.. అందుకే ఇప్పుడు ‘మాదిగ బిర్యానీ హౌజ్’ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మనకు గుర్తొచ్చేదేంటంటే.. మందకృష్ణ మాదిగ.. అందరూ తమ కులాలను పేరు వెనుక పెట్టుకున్నప్పుడు.. నా కులాన్ని నేనెందుకు పెట్టుకోవద్దనే.. మొండితనం.. కసి.. తన కులం అంటే అభిమానం.. తన కులం బాగుపడాలనే ఆరాటం.. ఆయనలో కనిపించేది. ఇప్పుడు కూడా ‘మాదిగ బిర్యానీ హౌజ్’ చెప్తుందేంటంటే.. ఒక్కసారి మా హోటల్‌కు వచ్చి చూడం.. శుచి శుభ్రత.. రుచి, వాసన.. అన్నింటిలో మేము భేష్.. అని.

గ్రేట్ ఇనిషియేటివ్..

ఇలా ఈ ‘మాదిగ బిర్యానీ హౌజ్’ ట్రెండ్ అయ్యేందుకు కారణం.. మా కులం కూడా ఇతర కులాలకు తీసిపోదని.. అన్ని కులాల పేర్లతో హోటల్స్ ఉన్నప్పుడు తమది మాత్రం ఎందుకు ఉండకూడదనేది వాళ్ల ఆలోచన అయ్యుండొచ్చు. అయితే ఈ హోటల్ ఎవరు, ఎక్కడ ప్రారంభించారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనిపై స్పందిస్తున్న జనాలు.. గ్రేట్ ఇనిషియేటివ్ అని ప్రశంసిస్తున్నారు. టోటల్‌గా అగ్రీ చేస్తున్నామని కామెంట్స్ పెడుతున్నారు. ఎవరి కులాన్ని వాళ్లు గౌరవించడంతోపాటు ఇతర కులాలను కించపరచనంత వరకు ఇలాంటివి మంచిదేనని చెప్తున్నారు.

కానీ ఎందుకంత చర్చ?

మన తెలుగు రాష్ట్రాల్లో లేదా దేశవ్యాప్తంగా చూస్తే బ్రాహ్మణ విలాస్, వైశ్య హోటల్, రెడ్డిగారి నాటుకోడి పులావ్, కమ్మగారి వంటలు, యాదవ హోటల్, గౌడ వైన్ షాప్స్.. ఇలా నిర్దిష్ట సామాజిక వర్గాల గుర్తింపుతో వందలాది వ్యాపారాలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. సమాజం వాటిని చాలా సాధారణ విషయంగా అంగీకరించింది. కానీ, సమాజంలో అణచివేతకు గురైన, దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ఉప కులం పేరుతో ఇలా నేరుగా ఒక బిర్యానీ పాయింట్ బోర్డు కనిపించేసరికి ఎందుకంత చర్చ. సాంప్రదాయక భావజాలం ఉన్న కొందరు దీనిని జీర్ణించుకోలేకపోతుండగా.. ప్రగతిశీల ఆలోచనలు ఉన్నవారు మాత్రం దీనిని గట్టిగా సమర్థిస్తున్నారు. అయితే.. సమాజంలో ఇంకా కొన్ని మూలల్లో ఉన్న అంటరానితనం, వివక్షా పూరిత ఆలోచనల వల్ల.. ఈ పేరు చూసి కస్టమర్లు వస్తారా రారా అనే ఒక నెగెటివ్ కోణంలో కూడా కొందరు దీనిని వైరల్ చేస్తున్నారు. మిగతా కులాల పేర్లు మార్కెటింగ్‌కు ప్లస్ అయినప్పుడు.. ఈ పేరు ఎందుకు కాకూడదనే కౌంటర్ వాదనను సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ‘మాదిగ బిర్యానీ హౌజ్’ బోర్డు నెట్టింట సృష్టించిన సెన్సేషనల్ అంతా ఇంతా కాదు.

Next Story