చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య..

by Kodari Anjali |

చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామంలో జరిగింది.

చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య..
X

దిశ, వెల్గటూర్: వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల సాయిమనోజ్( 23)అనే యువకుడు శనివారం ముక్కట్రావు పేటపల్లె ప్రకృతి వనంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సాయి మనోజ్ హైదరాబాద్ లో అమ్మానాన్నతో కలిసి ఉంటూ ఓలా, రాపిడో బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామంలోని అమ్మమ్మ వద్దకు వచ్చాడు. మరునాడే పల్లె ప్రకృతి వనంలో చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. యువకుడికి ఏం బాధ వచ్చిందో ఏమో ఎవ్వరికి తెలియదు. అర్ధాంతరంగా తనువు చాలించి తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చి వెళ్ళాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Next Story