అండగా ఉండండి.. కొండనైనా ఢీకొడతాం: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

ప్రజలు అండగా ఉంటే కొండనైనా ఢీకొడతామని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో ఆయన పర్యటించారు.....

అండగా ఉండండి.. కొండనైనా ఢీకొడతాం: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజలు అండగా ఉంటే కొండనైనా ఢీకొడతామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లి(Markapuram District Kishtamshettipalli)లో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నాం. స్త్రీశక్తి పథకాన్ని అమలు చేశాం. ఈ స్కీంతో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. పీఎమ్ కిసాన్-రైతు భరోసా కింద ప్రతి రైతు ఖాతాలో రూ. 20 వేలు జమ చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కోసం సంజీవనీని ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేయబోతున్నాం. మార్కాపురం తొలి స్థానంలో ఉంటుంది. ప్రజల కోసం చాలా పథకాలు అమలు చేస్తున్నాం. వచ్చే నెలలో తల్లికి వందనం అందజేయనున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.’’ అని చంద్రబాబు విమర్శించారు.

Next Story