త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం.. విశాఖ కలెక్టర్ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి అయ్యే దశకు చేరుకుంది. త్వరలోనే పనులు పూర్తి చేసుకుని ఈ ఎయిర్‌పోర్టు ప్రజలకు సేవలందించనుంది. ...

త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం.. విశాఖ కలెక్టర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు(Bhogapuram Airport) పూర్తి అయ్యే దశకు చేరుకుంది. త్వరలోనే పనులు పూర్తి చేసుకుని ఈ ఎయిర్‌పోర్టు ప్రజలకు సేవలందించనుంది. దీంతో ప్రారంభ తేదీ ప్రకటనపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్(Visakhapatnam District Collector Abishikth Kishore) కీలక ప్రకటన చేశారు. భోగాపురం ఫోయిర్‌పోర్టు ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం విశాఖ- భోగాపురం ఎయిర్ పోర్టు అనుసంధాన 7 రోడ్ల పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 5 రహదారులు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. ఇప్పటికే విశాఖ(Visakha) నుంచి డెడికేటెడ్ ఆర్టీసీ బస్(RTC Bus) సర్వీసును ప్రారంభించామని, ప్రస్తుతం బస్ బే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఎయిర్ పోర్టు కొనసాగుతోందని, కార్యకలాపాలు మాత్రం భోగాపురం నుంచి నిర్వహిస్తామని విశాఖ కలెక్టర్ అభిషిక్త కిషోర్ వెల్లడించారు.

Next Story