మంత్రి మేకప్‌పై వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు సీరియస్

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్‌పై ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.

మంత్రి మేకప్‌పై వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్‌పై ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మార్కాపురం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. అనిత ఒక దళిత మహిళ అని, శాంతి భద్రతలను కాపాడే ఆడబిడ్డను చూసి గర్వపడాలన్నారు. అలాంటి మహిళ మేకప్ గురించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తారా? అని ఫైరయ్యారు. ఆడబిడ్డలకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఎంత గర్వముంటే అలాంటి అవమానకర వ్యాఖ్యలు చేస్తారని ధ్వజమెత్తారు. ఓ పక్క రాష్ట్రంలో ఇష్టానుసారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఇంకోపక్క పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాన్ని అవలంబించడం సిగ్గుచేటన్నారు. ఆడబిడ్డలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని క్షమించబోమని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదని సీఎం పునరుద్ఘాటించారు. ఇది మా రాజధాని అని ప్రతిఒక్కరూ కాలర్ ఎగురవేసేలా అమరావతిని నిర్మిస్తామన్నారు. వైసీపీ మావిగన్ పేరు వింటే.. చిన్న పిల్లలు కూడా ఛీ కొడతారన్న సీఎం.. ఆనాడు మూడు రాజధానుల పేరుతో ఆ పార్టీ ఆయన మూడుముక్కలాటను గుర్తుచేశారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాక కూడా వైసీపీకి పరివర్తన రాలేదన్నారు.

Next Story