- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో రేపు పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం
జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం (జూన్ 28) ఉదయం 8 గంటలకు మెదక్ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ తెలిపారు.

దిశ, మెదక్ టౌన్: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం (జూన్ 28) ఉదయం 8 గంటలకు మెదక్ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ తెలిపారు. శనివారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించడంతో పాటు పిల్లల వైద్య నిపుణుల సేవలను కూడా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం చుక్కలు వేయించుకోలేని పిల్లలకు జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికి వచ్చే ఆరోగ్య సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నవారు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. అదే విధంగా ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాలు, ఇతర పని ప్రదేశాల్లో ఉన్న చిన్నారులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.






