భారత్ టాక్సీ’ సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా!

by Malleboina Mahesh |

డ్రైవర్లే యజమానులుగా దేశంలోనే తొలి కోఆపరేటివ్ ‘భారత్ టాక్సీ’ సేవలను గుజరాత్‌లో ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా! జీరో కమీషన్ మోడల్!

భారత్ టాక్సీ’ సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రవాణా రంగంలో సహకార విప్లవానికి నాంది పలుకుతూ కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా గుజరాత్‌లో సరికొత్త రవాణా సేవలను ప్రారంభించారు. శనివారం గాంధీనగర్‌లోని మహాత్మా మందిరంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) సేవలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ తో పాటు సహకార రంగానికి చెందిన ప్రముఖులు, వేలాది మంది డ్రైవర్లు పాల్గొన్నారు.

‘సారథే ఈ సేవలకు యజమాని’

'సహకార్ సే సమృద్ధి' (సహకారం ద్వారా శ్రేయస్సు) అనే నినాదంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టికి అనుగుణంగా ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రైవేట్ యాప్ ఆధారిత టాక్సీ సంస్థల చేతుల్లో వాహన చోదకులు (డ్రైవర్లు), వినియోగదారులు ఇద్దరు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దోపిడీ వ్యాపార నమూనాకు చరమగీతం పాడటానికే 'భారత్ టాక్సీ'ని తీసుకువచ్చామని, దీంతో డ్రైవర్లే యజమానులుగా కొనసాగుతారని అమిత్ షా చెప్పుకొచ్చారు.

Next Story