ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడు మృతి

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-27 10:33:14  IST  )

హైదరాబాద్‌లో ఓ టాటా ఏసి వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం బాలుడి ప్రాణం తీసింది. ముషీరాబాద్ లోని బోలక్ పూర్ లో వీధిలో నడుచకుంటూ వెళుతున్న బాలుడిపైకి టాటా ఏసి వాహనం దూసుకెళ్లింది.

ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడు మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఓ టాటా ఏసి డ్రైవర్ నిర్లక్ష్యం బాలుడి ప్రాణం తీసింది. ముషీరాబాద్ లోని బోలక్ పూర్‌లో వీధిలో నడుచకుంటూ వెళుతున్న బాలుడిపైకి టాటా ఏసి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ కాలనీలోకి హెవీ వెహికిల్స్ రావద్దని గతంలోనే స్థానికులు ఆందోళన చేశారు. అయినప్పటికీ కాలనీలోకి వాహనాలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నింధితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాలుడిపై టాటా ఏసి వాహనం దూసుకెళ్లిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే పసివాడు ప్రాణాలు కోల్పోయినట్టు కనిపిస్తోంది.

Next Story