భాగ్యరాజ్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం

by Vemula.Srinu Prasad |

ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. భాగ్యరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ ప్రార్థించారు...

భాగ్యరాజ్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్(Director, Actor, Writer Bhagyaraj) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Cm Ys Jagan Mohan Reddy) సంతాపం ప్రకటించారు. భాగ్యరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ ప్రార్థించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు రచయితగా, సహాయ నటుడిగా భాగ్యరాజ్ తన సినీ జీవితాన్ని ప్రారంభించారని జగన్ గుర్తు చేశారు. తన ఆసాధారణ ప్రతిభతో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.భారతీయ సినీ రంగంపై భాగ్యరాజ్ చెరగని ముద్ర వేశారని చెప్పారు. భాగ్యరాజ్ దర్శకత్వంతో పాటు కథ-స్క్రీన్‌ప్లే కూడా అందించేవారని, అలా చేసిన చాలా సినిమాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఘన విజయాలు సాధించాయని తెలిపారు. ప్రేమ, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను తన సినిమాల్లో హృద్యంగా ఆవిష్కరించారని వైఎస్ జగన్ కొనియాడారు.

Next Story