దిల్ రాజు భారీ ప్లాన్.. 'ఆర్య' క్యారెక్టర్‌పై యానిమేటెడ్ మూవీ

by Pulgam srinivas |

'ఆర్య' చిత్రాన్ని పూర్తి స్థాయి యానిమేటెడ్ మూవీగా తెరకెక్కించే దిశగా దిల్ రాజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దిల్ రాజు భారీ ప్లాన్.. ఆర్య క్యారెక్టర్‌పై యానిమేటెడ్ మూవీ
X

దిశ, వెబ్ డెస్క్: చాలా సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన 'ఆర్య' భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు ముగ్గురికీ విశేషమైన గుర్తింపు లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. 'ఆర్య' చిత్రాన్ని పూర్తి స్థాయి యానిమేటెడ్ మూవీగా రూపొందించేందుకు దిల్ రాజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు కూడా సుకుమార్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించేలా నిర్మాత ప్లానింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు పలు సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండగా, సుకుమార్ త్వరలో రామ్ చరణ్‌తో కొత్త సినిమాను ప్రారంభించనున్నాడు. మరి నిజంగానే 'ఆర్య'ను పూర్తి స్థాయి యానిమేటెడ్ మూవీగా తెరకెక్కిస్తారా? లేక ఇవన్నీ కేవలం ప్రచారానికే పరిమితమవుతాయా? అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.

Next Story