- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రచ్చకెక్కిన మహేష్ కాపురం.. లైవ్‌లో బూతులు తిట్టుకున్న భార్యభర్తలు.. నెటిజన్ల రియాక్షన్ ఇదే
వీడియోలో ఆ మహిళ ముఖాన్ని స్పష్టంగా చూపించనప్పటికీ, ఇద్దరూ ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ రచ్చ రచ్చ చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడిగా, కమెడియాన్ కొనసాగుతున్న మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఓ ఎమోషనల్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ‘‘జీవితం చాలా అన్‌ప్రెడిక్టబుల్, నేనే నిజం చెప్పే వరకు మీమర్స్, రిపోర్టర్లు ఏమీ రాయకండి" అంటూ ఆయన బాధగా మాట్లాడటంతో అభిమానులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆయనకు ఏమైందనే ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే మరో వీడియోతో మహేష్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో ఆయన తన భార్యతో తీవ్రంగా గొడవపడుతున్నట్లు కనిపించారు. వీడియోలో ఆ మహిళ ముఖాన్ని స్పష్టంగా చూపించనప్పటికీ, ఇద్దరూ ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఒకరి క్యారెక్టర్‌పై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా, మహేష్ భార్యగా ఉన్న ఆ మహిళ ఏకంగా తన చెప్పు చూపిస్తూ మాట్లాడటం గమనార్హం. పక్కన ఉన్నవాళ్లు వారిని ఎంత సముదాయించాలనుకున్నా వినకుండా, ఇద్దరూ ఒకరిపై ఒకరు దూషించుకుంటూ పెద్ద గొడవే పెట్టుకున్నారు.
ఈ గొడవ చూసి నెటిజన్లు నిజంగానే మహేష్ వ్యక్తిగత జీవితంలో ఏదో జరిగిందని అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అయింది. ఇదంతా మహేష్ నిజ జీవితంలో జరిగింది కాదు, ఆయన నటిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగమేనని తేలింది. ‘డి ఫర్ డైవర్స్’ అనే వెబ్ సిరీస్ పబ్లిసిటీ కోసమే మహేష్ ముందస్తు ప్లానింగ్‌తో ఇలాంటి ఎమోషనల్, కాంట్రవర్షియల్ వీడియోలను వదిలినట్లు స్పష్టమైంది. ఈ విషయం బయటకు రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మొదటి వీడియో చూసి తాము నిజంగానే కంగారు పడ్డామని, ప్రమోషన్ కోసం ఇంతలా రెచ్చిపోయావా బ్రో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం టాలీవుడ్‌లో ఈ మధ్య ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఎక్కువైపోయాయని, తాము ముందే ఇది సినిమా ప్రమోషన్ అని ఊహించామని అంటున్నారు.






