సీఎం చంద్రబాబు, లోకేశ్‌పై వ్యాఖ్యలు చేస్తే సహించం: జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

by Ramesh Naini |

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ల గురించి ఇష్టానుసారం మాట్లాడితే అంతు చూస్తామని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

సీఎం చంద్రబాబు, లోకేశ్‌పై వ్యాఖ్యలు చేస్తే సహించం: జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ల గురించి ఇష్టానుసారం మాట్లాడితే అంతు చూస్తామని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తాడిపత్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ రంగయ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో అమరావతి పెద్దల ఆదేశాల మేరకే అప్పటి ఎస్పీ ఫకీరప్ప తనను జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. తాడిపత్రిలో 300 మంది టీడీపీ నేతలపై 180కి పైగా అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్‌గా తాను రూ. 5 కే నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ సిస్టం వంటివి తీసుకొచ్చానని, గత ప్రభుత్వంలో వైసీపీ ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని, వారిపై చేయి వేస్తే ఊరుకోనని స్పష్టం చేశారు.

గంజాయి ఆరోపణలు...

గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి నుంచి ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు భారీగా గంజాయి సరఫరా జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. తనపై బనాయించిన అక్రమ కేసులకు నిరసనగా వచ్చే మంగళవారం (జూన్ 30) నగరంలోని కోర్టు ఎదుట టెంట్ వేసుకుని ఆందోళన చేస్తానని జేసీ ప్రకటించారు. ఈ కేసుల గురించి 420 లాయర్లు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story