- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ తేదీన 'ఫౌజీ' గ్లింప్స్ రిలీజ్.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా ఉండబోతుందా?
ప్రభాస్ 'ఫౌజీ' చిత్రం నుంచి ఆగస్టు 15న గ్లింప్స్ విడుదలతో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం కాగా, చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు మినహా ఎలాంటి కీలక అప్డేట్లను మేకర్స్ విడుదల చేయలేదు. అలాగే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వీడియోను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు, అదే రోజున విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.






