- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తిగత కారణాలతో సర్పంచి కుమారుడు మృతి
by Taduka Kalyani |
దిలావర్‌పూర్ మండలంలోని సాంగ్వి గ్రామ సర్పంచ్ కొచ్చర్ల భీమవ్వ–భీమేష్ దంపతుల పెద్ద కుమారుడు కొచ్చర్ల వంశీ (22) వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

X
దిశ, దిలావర్‌పూర్: దిలావర్‌పూర్ మండలంలోని సాంగ్వి గ్రామ సర్పంచ్ కొచ్చర్ల భీమవ్వ–భీమేష్ దంపతుల పెద్ద కుమారుడు కొచ్చర్ల వంశీ (22) వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం వంశీ మృతి చెందాడు.అందరితో కలివిడిగా ఉండే యువకుడు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Next Story






