- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ, మహిళా సంఘం భవనాలకు భూమిపూజ..
ముస్తాబాద్ మండలంలోని గోపాల్‌పల్లె గ్రామంలో అంగన్వాడి కేంద్రం, మహిళా సంఘం భవనాల నిర్మాణానికి శనివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

దిశ, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలోని గోపాల్‌పల్లె గ్రామంలో అంగన్వాడి కేంద్రం, మహిళా సంఘం భవనాల నిర్మాణానికి శనివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కె.కె. మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేకే మాట్లాడుతూ... ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళల సాధికారత, చిన్నారులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో ప్రజలతో కలిసి పనిచేస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఇటువంటి భవనాల నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






