బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు

by Batti.Sumithra |

దుమ్ముగూడెం మండలం పెదనల్లబల్లి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు
X

దిశ, దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండలం పెదనల్లబల్లి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు సభ్యుడిగా ఎన్నికైన పూసం దాసు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భద్రాచలంలో జరిగిన బీఎల్‌ఎస్ సమావేశ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ నాయకుడు తాత మధుసూదన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పూసం దాసు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల ఏకపక్ష నిర్ణయాలు, గ్రామపంచాయతీలో సంక్షేమ పథకాల అమలులో రాజకీయ జోక్యం కారణంగా అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, స్థానిక నాయకత్వం పనితీరు పై అసంతృప్తితోనే బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి మళ్లీ కొనసాగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, కణితి రాముడు, రేసు లక్ష్మి, తునికి కామేశ్వరరావు, వాగే కృష్ణ, మడకం భూపతిరావు, ఉడుగుల నిరీక్షణరావు, కుమారికుంట్ల సూర్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story