ఏపీ ఎయిర్‌పోర్టుల్లో లిక్కర్‌ అమ్మకాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల్లో లిక్కర్‌ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌లలో బార్‌లు, వైన్‌ షాపులు పెట్టుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...

ఏపీ ఎయిర్‌పోర్టుల్లో లిక్కర్‌ అమ్మకాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల్లో లిక్కర్‌ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌లలో బార్‌లు, వైన్‌ షాపులు పెట్టుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి మినహా రాష్ట్రంలోని మిగితా అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు వర్తింపు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎయిర్ పోర్టులో వైన్స్, బార్లకు 24 గంటలు అనుమతించింది. అంతేకాదు లైసెన్స్ ఫీజులు, పన్నులపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుమును రూ. 5 లక్షలుగా, మద్యం షాపుల దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా, ఎయిర్ పోర్టులో వైన్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్ రూ. 2 కోటిగా, 20 లక్షల సర్క్యులేషన్ దాటిన ఎయిర్ పోర్టుల్లో బార్లకు ఎక్సైజ్ ట్యాక్స్ రూ.25 లక్షలు, 20 లక్షలలోపు సర్క్యులేషన్ ఉంటే రూ. 15 లక్షలుగా ప్రకటించింది. అంతేకాదు మూడేళ్ల తర్వాత ఎక్సైజ్ విధానంపై సమీక్ష ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story