- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ బెల్ట్ షాప్‌పై కరీంనగర్ రూరల్ పోలీసుల దాడి.. భారీ మొత్తంలో మద్యం స్వాధీనం
అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారంతో శనివారం బెల్ట్ షాపుపై కరీంనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు.

దిశ, కరీంనగర్ రూరల్: అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారంతో శనివారం బెల్ట్ షాపుపై కరీంనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్‌కు చెందిన పలకుర్తి సాయి కృష్ణ తన నివాస గృహంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం సీసాలు బీర్ బాటిళ్లు మొత్తం సుమారు రూ.13,568/- విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు అక్రమ లాభార్జన కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుడి పై కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో పట్టణాల్లో అక్రమంగా నిర్వహించే బెల్ట్ షాపులు, గంజాయి, మద్యం , ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో జరిగే అక్రమ కార్యకలాపాల సమాచారాన్ని పోలీసులకు
నలుగురి బైండోవర్...
సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామానికి చెందిన నిందితులు సయ్యద్ ఖాదర్, షేక్ సలీం, శంభోజి శ్రీనివాస్ మరియు షేక్ సల్మాన్ లు అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడగా శనివారం కరీంనగర్ రూరల్ తహసీల్దార్ లక్ష్మి నర్సింహరావు ఎదుట హాజరుపరిచి ఒక్కొక్కరిని రూ.1,00,000/- విలువైన సత్ప్రవర్తన బాండ్‌పై బైండోవర్ చేయడం జరిగింది అని సీఐ తెలిపారు. జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్లు తెరిచి కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి మరోసారి హెచ్చరించారు.






