- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ కనిపించిన ప్రకంపనలు
వెనిజులాలో రెండ్రోజుల క్రితం భారీ భూకంపం మిగిల్చిన తీవ్ర విషాదం నుంచి ఇంకా బయటపడకుండానే.. ఆప్ఘనిస్తాన్ లో మరో భారీ భూకంపం సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: వెనిజులాలో రెండ్రోజుల క్రితం భారీ భూకంపం మిగిల్చిన తీవ్ర విషాదం నుంచి ఇంకా బయటపడకుండానే.. ఆప్ఘనిస్తాన్ లో మరో భారీ భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం రిక్టర్ స్కేలుపై దానితీవ్రత 6.2గా నమోదైనట్లు భారత జాతీయ సిస్మోలజీ కేంద్రం వెల్లడించింది. సుమారు 7.04 గంటలకు ఈ భూకంపం సంభవించగా.. ఆప్ఘాన్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఉత్తర భారతదేశంలోనూ పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భారత్ లో ఢిల్లీలోని నోయిడా, గురుగ్రామ్, జమ్ము&కశ్మీర్ లోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఇళ్లలో వస్తువులు కదలడంతో భయపడిన నివాసితులు ఇళ్ల నుంచి, అపార్టుమెంట్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ ప్రకంపనల వల్ల ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం నమోదు కాలేదు.
మరోవైపు పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో బర్ఖాన్, మూసాఖేల్, కోహ్లు, కింగ్రి, రఖ్ని వంటి ప్రాంతాల్లో శుక్రవారం నుంచి వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 4.3 నుంచి 5.3 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలకు మట్టి ఇళ్లు కూలిపోయాయి. పలువురు తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ఆప్ఘాన్ లో సంభవించిన భూంకంపం.. భూమి అంతర్భాగంలో దాదాపు 215 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. లోతు ఎక్కువగా ఉండటం వల్లే.. ప్రకంపనలు భారత్ వరకూ వ్యాపించినట్లు అంచనా వేస్తున్నారు. రెడ్ క్రాస్ సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు వచ్చే ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఆప్ఘనిస్తాన్ లోని హిందూకుష్ రీజియన్ ఒకటి. టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానినొకటి బలంగా ఢీకొట్టుకునే సరిహద్దు ప్రాంతంలో ఈ దేశం విస్తరించి ఉంది. అందుకే అక్కడ భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయని నివేదిక చెబుతోంది.






