- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ రివిజన్ పై అవగాహన సదస్సు : మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల రాక
బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ రివిజన్ ప్రోగ్రామ్ పై కార్యకర్తలు, నాయకులకు అవగాహన కల్పించేందుకు రేపు, అంటే 28-06-2026 ఆదివారం, సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ రివిజన్ ప్రోగ్రామ్ పై కార్యకర్తలు, నాయకులకు అవగాహన కల్పించేందుకు రేపు, అంటే 28-06-2026 ఆదివారం, సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఈ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కే.ఆర్.సురేష్ రెడ్డి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరుకానున్నారు. బాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి తోట ఆగయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సమావేశ వివరాలను వెల్లడించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ప్రతి గ్రామం నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.






