గుర్తుతెలియని దొంగ అనుమానాస్పద స్థితిలో మృతి

by Taduka Kalyani |

చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

గుర్తుతెలియని దొంగ అనుమానాస్పద స్థితిలో మృతి
X

దిశ, రాజేంద్రనగర్ : చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న అర్ధరాత్రి పల్లె చెరువు ప్రాంతంలోని స్వస్తిక్ శివ డెకరేటర్స్ గోడౌన్ లోకి గుర్తుతెలియని దొంగ మద్యం మత్తులో గోడౌన్ లోకి చొరబడ్డాడు. దొంగను గమనించిన డెకరేటర్స్ గోడౌన్ లో పనిచేస్తున్న కార్మికులు బాలాజీ (39), నాయన్ (23), ఉత్తమ్ బీర (35), ప్రేమ్ పరిహార్ (26) లు దొంగను పట్టుకొని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో కార్మికులు అతని కొట్టి గోడౌన్ లో బంధించారు. దీంతో కార్మికులు కొట్టిన దెబ్బలకు దొంగ మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు అన్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని దొంగ పై దాడి చేసి మృతికి కారణమైన నలుగురు వ్యక్తులను రిమాండ్ కు తరలించారు.

Next Story