- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ ఢీకొని మహిళ మృతి..
by Taduka Kalyani |
రోడ్డు దాటుతున్న సమయంలో లారీ అతివేగంగా ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చేగుంట 44వ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది.

X
దిశ,చేగుంట 01: రోడ్డు దాటుతున్న సమయంలో లారీ అతివేగంగా ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చేగుంట 44వ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... చేగుంట పట్టణానికి చెందిన కర్నే మంజుల (35) వ్యవసాయ పొలం వద్దకు రోజు మాదిరిగా వెళ్లి తిరిగి రోడ్డు దాటి ఇంటికి వస్తుండగా హైదరాబాదు నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న లారీ అతివేగంగా ఢీకొనడంతో మంజుల అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు మంజులకు ఇద్దరు కూతురు లు కొడుకు ఉన్నారు. భర్త కర్నె లచ్చయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Next Story






