- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ అధినేత్రి కవితక్క సమక్షంలో టీఆర్ఎస్‌లో భారీగా చేరికలు ...
టీఆర్ఎస్ భవన్‌లో టీఆర్ఎస్ అధినేత కవితక్క చేతుల మీదుగా కండువాలు కప్పుకొని వందమంది పార్టీలో చేరినట్లు టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ తెలిపారు.

దిశ, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల నుండి శనివారం హైదరాబాదులోని టీఆర్ఎస్ భవన్‌లో టీఆర్ఎస్ అధినేత కవితక్క చేతుల మీదుగా కండువాలు కప్పుకొని వందమంది పార్టీలో చేరినట్లు టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ మజీద్ తెలిపారు. మండల నాయకులు కదిరే భాస్కర్, జావీద్, దేవరాజు, కనకయ్య, రాజేష్, రేణుక, అశోక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మజీద్ మాట్లాడుతూ ..రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు టిఆర్ఎస్ పార్టీ అధినేత కవితక్క ప్రవేశపెడుతున్న పాంచ జన్యం ఉచిత విద్య, వైద్యం, ఉపాధి ఉద్యోగాలు, రైతే రాజు, సామాజిక న్యాయం ఎంతో బాగున్నాయని వాటిని అమలు చేస్తే రాష్ట్రంలోని అన్ని పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్థిక సమస్యలు లేకుండా బతకవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధినేత కవితక్క ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవడం జరుగుతుందన్నారు. కవితక్క తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేవారు నేరుగా 9441377068 కు సంప్రదించాలని జిల్లా ఇన్చార్జ్ మజీద్ కోరారు.






