హైదరాబాద్‌లో మరో లిఫ్టు ప్రమాదం.. 8 మందికి గాయాలు

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్‌లో ఇటీవల లిఫ్టు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రీసెంట్ ఖైరతాబాద్ లో లిఫ్డు డోర్ తెరుచుకున్నప్పటికీ లిఫ్టు రాకపోవడంతో కిందపడి మహిళ చనిపోయింది.

హైదరాబాద్‌లో మరో లిఫ్టు ప్రమాదం.. 8 మందికి గాయాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో ఇటీవల లిఫ్టు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రీసెంట్ ఖైరతాబాద్ లో లిఫ్డు డోర్ తెరుచుకున్నప్పటికీ లిఫ్టు రాకపోవడంతో కిందపడి మహిళ చనిపోయింది. మరోవైపు కొద్దిరోజుల క్రితం ఉప్పల్ స్కైవాక్ వద్ద లిఫ్టులో ఇరుక్కుని ఓ యువకుడు రెండు గంటలపాటు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఇక తాజాగా హైదరాబాద్ లోని మీర్ పేట్‌లో లిఫ్టు ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో కొత్త ఫ్లాట్ చూసేందుకు వెళ్లిన కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ఐదో అపార్ట్ మెంట్‌‌లోని ఫ్లాట్ చూసేందుకు వారు వెళ్లగా ఒక్కసారిగా అది గ్రౌండ్ ఫ్లోర్ పై కూలిపోయింది.

ఈ ప్రమాదంలో విశ్రాంత జ్యుడిషియల్ ఉద్యోగి న‌ర‌సింహ‌స్వామితో పాటు అత‌డి బంధువులు ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఎల్బీన‌గ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ఒక‌రి ప‌రిస్థతి విష‌మంగా ఉన్న‌ట్టు వైద్యులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. వరుస లిఫ్టు ప్రమాదాల నేపథ్యంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. లిఫ్ట్ కోసం బటన్ నొక్కిన తరవాత చూసి అడుగు వెయ్యాలని వెంటనే లోపలికి వెళ్లొద్దని అంటున్నారు. అంతేకాకుండా లిఫ్ట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో మేనేజ్మెంట్ తరచూ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story