సీఎం రేవంత్ రెడ్డి సభకు డీసీసీ కైలాస్ నేతకు ఆహ్వానం అందేనా..?

by Batti.Sumithra |

నల్లగొండ నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తొలిసారిగా ఈనెల 28న రానున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సభకు డీసీసీ కైలాస్ నేతకు ఆహ్వానం అందేనా..?
X

దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తొలిసారిగా ఈనెల 28న రానున్నారు. హ్యాం పథకం కింద సుమారు రూ.13 వేల కోట్లతో నిర్మాణం కానున్న రోడ్లకు కనగల్ మండల కేంద్రంలో శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన కోసం ప్రత్యేకంగా నిర్మించిన పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. అనంతరం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంజీ కాలేజ్ మైదానంలో దాదాపు 50 వేల మందితో బహిరంగ సభ జరగనుంది.

డీసీసీకి ఆహ్వానం అందేనా..?

నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు శాసనసభ నియోజకవర్గ కేంద్రం కూడా ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి అధికారిక హోదాలో వస్తున్నారు. ఈ క్రమంలో అనేక సంక్షేమ పథకాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రారంభించిన అనంతరం ఎన్జీ కాలేజీలో బహిరంగ సవరణ ఉద్దేశించి సీఎం మాట్లాడతారు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాసనేత, ప్రస్తుతం జరగబోయే సభాధ్యక్షులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య వైరం గత కొద్దిరోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. పున్న కైలాస్ నేత పుట్టినరోజు నుంచి ఆ వైరం తారస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎం హాజరయ్యే సభకు డీసీసీ అధ్యక్షులు కైలాస్ నేతకు ఆహ్వానం అందుతుందా లేదా అని అనుమానం కలుగుతుంది.

ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి అనుచరులు ఎట్టి పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్షులు సీఎం సభ కోసం ఫ్లెక్సీలు కట్టకూడదు.... సభ ప్రాంగణానికి కూడా రావొద్దు... వస్తే భౌతిక దాడులకు కూడా సిద్ధమని సమాచారం పరోక్షంగా పంపినట్లు తెలుస్తోంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీ సీఎం జిల్లా కేంద్రానికి వస్తుంటే అదే పార్టీకి చెందిన ఈ జిల్లా అధ్యక్షుని రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. బలహీన వర్గాలకు చెందిన బిడ్డ పార్టీ అధ్యక్షుడు అయితే అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు మేము వేస్తే గద్దెనెక్కిన వాళ్లు.. మమ్మల్ని అడ్డుకోవడం కుట్రబుద్ధికి తార్కాణం. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మంత్రికి నచ్చజెప్పి డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేతను సభకు ఆహ్వానం అందేలా చర్యలు తీసుకుంటారా లేదా మంత్రి వెంకట్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగానే నడుస్తారా చూడాలి మరి.

Next Story