- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
by Kodari Anjali |
ఇళ్లల్లో అలాగే ద్విచక్ర వాహనాల దొంగతనం చేసి పరారైన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.

X
దిశ, టేకుమట్ల (మొగుళ్ళపల్లి): మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామంలో రెండు నెలల క్రితం జరిగిన ఇళ్లలో మరియు ద్విచక్ర వాహనాల దొంగతనం చేసి పరారైన వ్యక్తిని పట్టుకున్నట్లు చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన దాసరి మురళీకృష్ణ (30) ను అరెస్ట్ చేసి చోరికి గురైన బైక్‌ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చోరీ కేసులో ఉన్న నిందితుడి మురళీకృష్ణపై రాష్ట్రవ్యాప్తంగా 42 పైగా చోరీ కేసులు ఉన్నాయని మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వారిని కూడా త్వరలో పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు.
Next Story






