- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తే మృత్యువుకు కారణం
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పై కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం సమీపంలో శనివారం చోటుచేసుకున్న ద్విచక్ర వాహన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనలో మద్యం మత్తే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు.

దిశ, కోదాడ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పై కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం సమీపంలో శనివారం చోటుచేసుకున్న ద్విచక్ర వాహన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనలో మద్యం మత్తే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలను పరిశీలించిన అనంతరం ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేనని తేల్చారు.
మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్, శివాజీగా గుర్తించారు. వీరిద్దరూ కోదాడలోని ఓ రైస్‌మిల్లులో హమాలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం సేవించిన అనంతరం ద్విచక్ర వాహనం పై అధిక వేగంతో ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. విచారణలో ఎలాంటి కుట్ర లేదా ఇతరుల ప్రమేయం లేదని, మద్యం మత్తులో అధిక వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని నిర్ధారణకు వచ్చినట్లు సీఐ శివశంకర్ తెలిపారు. ప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తును పూర్తి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి వెంట పట్టణ ఎస్‌ఐలు సుధీర్ కుమార్, ఉపేందర్ రెడ్డి, చిన్న మల్సూర్ ఉన్నారు.






